Wednesday, August 27, 2008

నీ రాక కోసం..........

Naaku chinnappati nunchi stories raayadam anna, chadavadam anna, chaalaa ishtam.. so presnet 1 year nunchi khaali gaa vunna kaabatti naalo talent ki padunu pedudam ani konni stories raasaanu...
andulo idi 1st story...
indulo paatralu anni kalpitaalu, evarini vuddesinchinavi kaadu ( ma frn ilaa raayali ani cheppindi b4 story :) )

onl magazines vunte cheppara, na stories post chesukuntaa...




నువ్వు నాతొ వుంటే ప్రపంచం అంతా నా గుప్పిట్లో వున్నట్టుంటుంది ...

ఎందుకో గాలి లో ఎగురుతున్నట్లు,
సెలయేటి తో ఆడుకుంటున్నట్లు,
నీ వూపిరి లో నిడురోతున్నట్టు అనిపిస్తుంది...

నువ్వెప్పుడు వస్తావో తెలియదు,
కాని ఎప్పుడూ నువ్వు నాతోనీ వున్నట్టు ఒక ఫీలింగ్....

ఏంటి అర్ధం కాలేదా...!
నా పేరు స్రవంతి.
తన పేరు అయ్యబాబోయ్ చెప్పాలంటేనే నా బుగ్గలు సిగ్గు పడుతున్నాయి. నా కళ్లు నవ్వుతున్నాయి..
తన పేరు అరుణ్.
చాలా బాగుంది కదా , నాకు తెలుసు , తను కుడా తన పేరు లానే చాలా మంచి వాడు.
12 సంవత్సరాల క్రితం , తనని మొదటి సారి చూసా...
వాళ్ల నాన్న తో అనుకుంటా, మా క్లాసు రూమ్ లోకి వచ్చాడు
రాగానే నాకు పోటి గా చదవడం మొదలెట్టేసాడు. ఎప్పుడూ వాడికి పరిక్షలప్పుడు జ్వరం రావాలి దేముడా, వీలు రాయకూడదు దేముడా అని మొక్కుకోనేదాన్ని...
ఇంకేముంది వాడు వేరే పార్టీ , నేను వేరే పార్టీ....
మా మధ్య పచ గడ్డి బగ్గుమనడం కాదు బూడిద అయ్యేది , అంతలా కొట్టుకొనే వాళ్ళం.

ఏడోక్లాసు లో అనుకుంటా, వాడికి ఒకసారి నిజం గా జ్వరం వచ్చింది, నెల రోజులు స్కూల్ ఫట్. పాపం బక్కపీచు ఇయ్యి స్కూల్ కి వచ్చాడు.
అప్పుడు పాపం అనిపించింది.దేముడి మీద కోపం కుడా వచ్చింది. ఒక వేళ నేను అడిగితె మరీ ఈ రేంజ్ లో తీర్చేయ్యాలా న కోరిక అని !!
అప్పుడు మొదటి సారి వాడితో స్నేహం గా మాటలాడా, నీ ఆరోగ్యం జాగ్రత్త, నోట్స్ కావాలంటే నేను ఇస్తాను అని. వాడి ఫ్రెండ్స్ అందరికి నేను నే విల్లన్ నీ .. నా వల్లే వాడికి జ్వరం వచ్చింది అని వాళ్ల ఫీలింగ్..

అప్పుడే స్కూల్ లో ముగ్గుల పోటీలు.. నాకా ముగ్గులు రావు, కాని అన్నింటిలోను నేనే ఫస్ట్ వుండాలి అని పిచ్చి. ఎంత కష్టపడి ముగ్గులు నేర్చుకున్నానో అంతేకష్టపడి ఓడిపోయా.. ఆ పిల్ల వీణా గెలిచింది.
ఓ ఆ పిల ఎవరో చెప్పలేదు కదా, అది అరుణ్ గాడి జిగ్రి దోస్త్ , మా వాడి పక్క ఇల్లే తనది.
అప్పుడు అరుణ్ గాడు నా దగ్గరకి వచ్చి, భాద పడకు, ఈ సారి నువ్వు తప్పకుండా గెలుస్తావు అన్నాడు.
ఇంకేముంది , మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మీ అయ్యిపోయాము.. ఇక నేను దేముడిని క్లాసు లో నాకు లేక వాడికే ఫస్ట్ రావాలి అని కోరుకోవడం మొదలెట్టా..
అరుణ్ చాలా బాగా మాటలాడుతాడు, ఎవరైనా తన మాటలు వింటే చాలు తనకి దగ్గరైపోతారు. ఇక క్లాసు లో మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మీ అయిపోయాము. వీణా కేమో కుళ్ళు, అలా అలా నవ్వుతూ , తుళ్ళుతూ స్కూల్ దాటి కాలేజీ కి వచ్చాం.


అరుణ్ కేమో ఇంజనీరింగ్ ఇష్టం, m p c లో జాయిన్ అయ్యాడు, నాకు ఇంజనీరింగ్ , మెడిసిన్ అం ఏమి లేదు, కాని ఎందుకో తన గ్రూప్ లో తనే ఫస్ట్ రావాలి అనిపించింది. కాబట్టి, Bi p c లో జాయిన్ అయ్యా.. కాలేజీ లు వేరు వేరు ఐనా రోజూ మాటలాడుకొనే వాళ్ళం. అరుణ్ అందరితో బాగా కలిసిపోయేవాడు, రోజూ ఏదో ఒక కొత్త న్యూస్ చెప్పే వాడు.

శ్రావూ, నీ ఫోటో నా ఫ్రెండ్ కి భలే నచ్చిందే, నీతో మాట్లాడుతాడంటే అనేవాడు.
కోపం వచ్చేది.
ఎందుకో తెలియదు.
ఇలా అరుణ్ మీద కోపం తో అన్నం మానేయ్యడాలు, తను బ్రతిమిలడడం, , తనకి మంచి ర్యాంక్ రావాలని మొక్కుకోవడాలు, తన అల్లరి మాటలు గుర్తొచ్చి క్లాసు మధ్య లో నవ్వడం, సర్ చేత తిట్టిచుకోవడం తో 2 సంవత్సరాలు గడిచిపోయాయి.

అరుణ్ కి ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్, నాకు మెడిసిన్ లో మంచి ర్యాంక్..
అదృష్టం ఏంటంటే తను నేను ఒకే campuss లో B'tech కి మెడిసిన్ కి జాయిన్ అయ్యాం . కొంచెం జేలస్ ఫీలింగ్ వీణ కుడా వాడి బ్రాంచ్ లోనే జాయిన్ ఐంది. అరుణ్ కి నేనొక్కదాన్నే ఫ్రెండ్ నీ అని తెలుసు, కాని మనసు లో ఏదో చిన్న భాద.
క్లాసు లో అందరు వాడికి లైన్ వేస్తున్నరంటా, నవ్వుతూ చెప్పుతున్నాడు, నాకు ఎందుకో నచ్చలేదు. అరుణ్ నీ ఇష్టపడటం అప్పుడే మొదలెట్టానేమో !!

అలా బాగా ఎంజాయ్ చేస్తూ ఒక రోజు అమ్మాయిల ముందు బైక్ తో ఫీట్స్ చేయబోయి, ఒళ్ళంతా దెబ్బలతో మా హాస్పిటల్ లో నాకే పేషెంట్ గా జాయిన్ అయ్యాడు. ఎందుకో నాకే తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంది. తన క్లాసు కి వెళ్లి అందరికి వార్నింగ్ ఇచ్చా, వీణా కి ఐతే మరి మరీ..
అరుణ్ నీ వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు.
అన్నం తినాలనిపించలేదు.
నిద్ర పోవలనిపించలేదు.
కనిపించిన ప్రతి దేముడి నీ పరమత భేదాలు లేకుండా ప్రే చేశా...
ఏమిటిదంతా....
ఒక ఫ్రెండ్ కోసం ఇంట తపాన్ పడుతున్నానా..
లేదు ఇంకా ఎక్కువైన ఒక వ్యక్తీ కోసం.
అంతే నేను వాడిని ఇష్టపడుతున్నాన,
లేదు ప్రేమిస్తున్నానేమో...
అవును
తనంటే నాకు ప్రాణం, చాలా చాలా ప్రాణం.
మొదటి సారి ఓ పిల్ల గాలి తిమ్మేరాల నన్ను తాకింది ప్రేమ. నాతోటి డాక్టర్స్ అందరు నన్ను వింత గా చూడటం మొదలెట్టారు.ఎవరితో కలవని నేను వాడి కోసం అంతగా తపన పడటం చూసి. ఐనా వాళ్ళకి సగం అర్ధం ఐపోయింది నాకు లవ్ ఫీవర్ పట్టింది అని.
కాని అరుణ్ అలానే ఫీల్ అవుతున్నాడా !!!
అవును అనిపిస్తుంది, కాదు అనిపిస్తుంది.
తనకి నా గుండె చప్పుడు వినపడటం లేదా...
నా కళ్లు మాటలాడే మాటలు వినపడటం లేదా !!

ఒక రోజు ధైర్యం చేసి , అది కుడా కాదు, అరుణ్ వెనుక పడే అమ్మాయి ల సంఖ్యా చూడలేక చెప్పేసా, నువ్వంటే ఇష్టం రా అని, అయ్యగారి డైలాగ్ ఏంటో తెలుసా, నాకు నువ్వంటే ఇష్టమే కదా, అందుకే మనం ఫ్రెండ్స్ మీ కదా అని.. !!
తన్నలనిపించింది.
కాని నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అనిపించింది.
అరుణ్ మాత్రం ఫీట్స్ చేయడం , ౨ నెలలకొకసారి నాకే పేషెంట్ గా జాయిన్ అవ్వడం, , common గా జరిగిపోతున్నాయి...
కాని నా మనసు నాకు అర్ధం కావడం లేదు , అది ప్రేమో, ఇష్టమో, జెలసి నో తెలియదు. తను ఒక అమ్మాయి నీ బైక్ మీద డ్రాప్ చేసాడని తెలిసి వారం రోజులు మాటలాడలేదు. కాని ఆ వారం రోజులు తన లండ్లినే కి ఎన్ని బ్లాంక్ కాల్స్ చేసానో లెక్కే లేదు..

స్టడీస్ పుర్తవ్వబోతున్నాయి, ఇంతలొ ఒక బాంబ్ లాంటి వార్తా నా నెత్తి మీద పడింది. " అరుణ్ మస్ చేయడానికి అస్ వెళ్తున్నాడు అని ". మొదటి సారి అనిపించింది మేమిద్దరం ఒకరికి ఒకరం కామేమో అని ! అరుణ్ వెళ్ళిపోతున్నాడు, నా గురించి ఆలోచించకుండా...
నేను తన తో మాటలాడలేకపొయాను. ఫోన్స్ కట్ అయ్యాయి. మాటలాడితే ఏడుపు వచ్చేస్తుందేమో అని భయం. ఈ 12 సంవత్సరాలలో తన గొంతు విన్నని రోజు ఒక్కటి కుడా లేదేమో !!
అలాంటిది తను కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్తున్నదంటే ఆ భాద భారిచలేకపోతున్నాను.
ఎ పని చేయలేకపోతున్నాను.
అమ్మ తిట్టింది, అరుణ్ ఈ రోజు వెళ్తున్నడంటా, వెళ్లి సెండ్ ఆఫ్ చెప్పి రా అని.
అరుణ్ నన్ను వదిలి వెళ్ళడం నేను చూడలేను. కాని చివరి సారిగా ఒకసారి తనని చుడాలి అనిపించింది.

Airport కి వెళ్లాను.తన గర్ల్ ఫ్రెండ్స్ అందరు తయారు, అంత భాద లోను కోపం వచ్చింది. అరుణ్ దగ్గరకి వెళ్లాను, నా దగ్గర మాటలు లేవు. కన్నీళ్లు వచేస్తున్నాయి. భయం వేస్తోంది, ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతాడో అని చేయి గట్టి గా పట్టుకు నిల్చున్నా.. అరుణ్ ఫ్లైట్ అనౌన్సుమెంట్వచేసింది, తనని వెళ్లొద్దు, నాకు నువ్వు కావాలి అని చెప్పాలని వుందికాని ఇది తను తీసుకున్న నిర్ణయమే కదా ... !
" ఏమైనా చెప్పవా " అని అడిగాడు , ఏమిని చెప్పను ? నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పితే తను నాకోసం ఆగిపోతాడా, తెలియదే !!

వెళ్ళిపోయాడు, నన్ను వదిలి చాలా దూరం.
రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియదు, కాలేజీ కి వెళ్తున్న, వస్తున్నా, ఎవరితో మాతలదలేకపోతున్న, నాకు నేనే చాలా ఒంటరిని అయిపోయాను.
అలాంటి రోజుల్లో ఒకరోజు వున్నట్టుండితన ఫోన్.
అసలు మతలాదకూడదుఅనుకున్నా, కాని పక్కన అమ్మ వుంది " హలో " అన్నాను.
" స్రవంతి " అన్నాడు.
" నీకు నేనంటే ప్రేమ లేదా ! " అని అడిగాడు...ప్ర్రాణం అని చెప్పమంతోంది మనసు, కాని మాటలు రావడం లేదు . నువ్వంటే నాకు ఇష్టం రా, నీకు దూరం గా వుందాం ఇష్టం లేకనే అన్ని సార్లు బైక్ ఆక్సిడెంట్ చేసి నీ దగ్గర పేషెంట్ గా జాయిన్ అయ్యే వాడిని, నీ స్టడీస్ తరువాతా నీకు పెళ్లి చేసేస్తారు అనే భయం తోనే నీకు దూరం గా వచ్చేసాను బంగారు, ఇప్పుడు కూడా నీకు చెప్పకూడదు అనుకున్నా, కాని ఒక్కసారి అడగాలి అనిపించింది, నువు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదా.. అని అన్నాడు అరుణ్..

ఒక్క క్షణం నా చెవులు ఏమి వింటున్నాయో అర్ధం కాలేదు... పిచ్చి ఆనందం వేసింది, ఎగిరి గంతులు వేయాలనిపించింది. సంతోషం తో మాటలు రావడం లేదు, నువ్వంటే నాకు చాల ఇష్టం రా, ప్ర్రాణం రా, నాకు దూరం గా వుండొద్దు , నువ్వు లేకుండా నేను బ్రతకలేను వచ్చెయ్యి అని అతి కష్టం మీద త్వరత్వరగా చెప్పేసాను.. నాకు ఆ అనందం లో మాటలు కుడా దొరకడం లేదు...

మా ఇద్దరికీ మాటలు రావడం లేదు.

కాని మా మనసులు మాటలాడుకుంటున్నాయి.

తను వచ్చేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమె వున్నాయి.

నువ్వెప్పుడు వస్తావో తెలియదు,
కాని నువ్వు నాతోనే వున్నావు అనే ఒక తియ్యటి తలపు నన్ను శ్వాసింపచేస్తుంది....

నీ రాక కోసం వేచి చూస్తూ ........

ఇట్లు,
నీ sravanti

8 comments:

Anonymous said...

nice story dear...

Sreeharsha Dugga said...

I guess i was the first person to read this story.. and provide some comments/reviews on it.. :)

masthan said...

chala natural ga rasavu chandana...u wont feel this is a story...i felt it happens really....it was very nice....thanks for a good story....

sreechandana said...

story e nijam gaa.. neeku nachindi kada, thks for ur comments masthan

Anonymous said...

hi akka very nice n amazing
u r really cute akka!!!!!!!!!!!

Nirupama said...

hey chandana...
story chala bagundi...keep writing more...[:)]

Ramana KV said...

Too good... Chaala baagundhi.. O manchi cinema choosinantha gaa...

'కాని ఎందుకో తన గ్రూప్ లో తనే ఫస్ట్ రావాలి అనిపించింది. కాబట్టి, Bi p c లో జాయిన్ అయ్యా..' Haha.. Emi comedy twist ichaaro.. Navvu aagaledhu naakithe..

dukkas said...

Hi mee sravanti chala bavundi heart touching, evaro chepparu a womens heart is a deep ocean chala dachukuntadi lopala ani.......kani oh ammyi premistey intala premistada gr8 andi.......i will be waiting for ur next release.....